ఇల్లు అందంగా అనిపించాల అంటే రంగుల అమరికలో శ్రద్ధ పెట్టండి, ఇంటికి చక్కని లుక్ వస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ ఇంట్లో అన్ని గదులకు ఒకే రంగు బావుండదు. పడకగదికి లేదా హాల్లో ఒక గోడకు కాస్త ముదురు రంగు వేస్తే ఆ రూమ్ కి ప్రత్యేకత వచ్చేస్తుంది. సోఫాలు,కుర్చీల్లో వేసే పిల్లో కవర్స్ ఒకే మాదిరివి కాకుండా,ఒక్క పిల్లో కి ఒక రంగు కవర్ వేస్తే ఇంట్లో ఆ రంగుల ప్రత్యేకత తెలుస్తు ఉంటుంది. అలాగే కర్టెన్స్ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. రంగులు మార్చేస్తు ఉండాలి. హాల్లో  ఒక గోడకు ప్రత్యేకమైన రంగు వేసి ముందర సోఫాసెట్ వేయచ్చు,పెయింటింగ్స్ ,వాల్ క్లాక్స్ ప్రత్యేకంగా ఉండేలా చూడాలి గది మూలల్లో పూలకుండీల రంగు రంగుల లైటింగ్ తో ఇంటికి కొత్త అందం వస్తుంది.

Leave a comment