Categories
మాస్క్ లేకుండా బయటకు అడుగు పెట్టటం అత్యంత ప్రమాదకరం అని తేలాక ఫ్యాషన్ ప్రపంచ కూడా ముఖాన్ని తలనూక్ కప్పేలా,రకరకాల మాస్కులు డిజైన్ చేస్తూ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ కు తెరతీస్తుంది .వైరస్ ను అడ్డుకొనేందుకు అయినా మాస్క్ ఫ్యాషన్ గా అనిపించాలి అనుకొంటారు అమ్మాయిలు .అందుకే డ్రస్ లకు మ్యాచ్ అయ్యేలా డిజైనర్ మాస్కులు తాయారు చేస్తున్నారు .అనేక బ్రాండెడ్ కంపెనీలు ఇక రాబోయే రోజుల్లో మాస్క్ కూడా తప్పని సరి యాక్సాసరీ గా మారుతుంది అంటున్నారు .ఇక డ్రెస్ తో పాటు మాస్క్ కూడా కుట్టేస్తారన్నమాట .