హిందుస్థాన్ టైమ్స్, వారి ఇతర ప్రచురణ సంస్థలకు చైర్ పర్సన్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా మీడియా రంగంలో ప్రభావిత మహిళగా నిలబడ్డారు శోభనా భార్తియా. ప్రతిష్టాత్మక విద్యా సంస్థ బిట్స్ పిలానికి ప్రోచాన్సులర్ కూడా వున్నారామే. రాజ్యసభలో నామినేటెడ్ మెంబర్. ఎండెవర్ ఇండియాకి ఆమె ప్రస్తుత చైర్మన్. ఆమె తండ్రి కె.కె బిర్లా తాత జి.జి బిర్లా, శక్తి వంతమైన వ్యాపార కుటుంబంలో పుట్టిన శోభన పత్రికా రంగంలో అతి చిన్న వయస్సులో బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏనాడో ఆమెను గ్లోబల్ లీడర్ ఆఫ్ టుమారో గా కీర్తించింది. ఔట్ స్టాండింగ్ బిజినెస్ విమెన్ అవార్డు, కార్పోరేటే ఎక్స్ లెన్స్ అవార్డు, జర్నలిజం రంగంలో పద్మశ్రీ , ఆమెను వరించాయి. మింట్ పత్రిక, ఫీవర్ 104, ఎఫ్ ఎమ్ రేడియో ఛానల్ ఆమె రూపం పోసినవే మీడియా రంగం లో తిరుగు లేని మహిళ శోభనా భార్తియా.
Categories