మన భారతీయ ఆహార పదార్దాలు తయారీలోనే సుగంధ ద్రవ్యాలు తప్పని సరిగా కలగలనే ఉంటాయి. రుచికి,ఆరోగ్యం కోసంగా కూడా ఒక్క పదార్థం కోసం కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు ఎంచి మరీ వేశారు. అల్లం వెల్లులి మిరియాలు ఇలా ఎన్నో ఆహారానికి రుచిని ఇస్తాయి. ఇవి ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ కలిపిస్తాయి. దాల్చిన చెక్క లోని సిన్న మాల్డ్ హైర్ కడుపులో మాన్తా తాగిస్తుంది. పుదీనా జీర్ణ కోశాన్ని ఆరోగ్యాంగా వుంచి పేగుపూత లక్షణాలను నియంత్రిస్తుంది. పసుపు చర్మ ఆరోగ్యానికి రోగనిరోధక శక్తి పెంచేందుకు ,కాన్సర్ వంటి అనారోగ్యాల ముప్పును తగ్గిస్తుంది . ఎండు మిరపలోని క్యాప్స్ సిన్ జీవక్రియ వేగం పెంచుతోంది. ఆకలిని పెంచుతోంది ,కొవ్వు తగిస్తుంది. ఇలా సుగంధ ద్రవ్యాలన్నీ ఆరోగ్య సిరులే.

Leave a comment