వర్షా కాలంలో తేమ తో వంటకు ఉపయోగించే దినుసులకు బూజు, పురుగు పడతాయి.పప్పు దినుసులు బియ్యం మొదలైన వాటిని నిల్వ చేయటం లో జాగ్రత్తలు తీసుకోవాలి.చిరు ధాన్యాల పప్పులు నిల్వచేసే డబ్బాలు బాగా తుడిచి ఎండలో పెట్టి శుభ్రం చేసిన డబ్బాలో గుప్పెడు వేపాకులు వేస్తే ఇవి పురుగులు రాకుండా చేస్తాయి. అలాగే సేమియాలు నిల్వచేసే ముందర కాస్త వేయిస్తే పురుగు పట్టవు.లేదా సేమ్యాలు ఉన్న డబ్బాలో కాసిన్ని లవంగాలు వేయాలి.పిండి ఉన్న డబ్బాలో రెండు మూడు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పట్టదు.అలాగే పిండి లో పురుగులు చేరకుండా రెండు బిర్యానీ ఆకులు వేయాలి. లేదా పిండిలో ఓ పసుపు కొమ్ము లేదా కరివేపాకు వేస్తే   పురుగు పట్టదు.

Leave a comment