Categories
ఒక్కసారి పాలు పొయ్యి మీద పెట్టగానే విరిగిపోతు ఉంటాయి. అవి ఇక పారబోస్తూనే ఉంటారు . కానీ విరిగిపోయిన పాలతో స్వీట్ కోవా తయారు చేసుకోవచ్చు. గుడ్డు కలిపి చక్కని స్ముథగా ప్రయత్నం చేయచ్చు. పాలకోవ కూడా చేసుకోవచ్చు . పాలకోవా తయారు చేయాలంటే నీళ్ళన్నీ వడకట్టి వచ్చిన గుజ్జులో పంచదార,బెల్లం కలిపి ఉడకనిస్తే సరిపోతుంది దీన్ని నేరుగా తిన్న,మిఠాయిలో కలిపినా రుచిగానే ఉంటుంది. విరిగిన పాలు పూల కుండీలో ఎరువుగా కూడా వాడచ్చు. ఇందులో ఉండే కాల్షియం మొక్కని బలంగా వుంచుతోంది . టమాటో మొక్కకు ఇది చక్కని ఎరువు కూడా పొడి చర్మం గలవారు ఈ విరిగిన పాల గుజ్జులో తేనె కలిపి మెత్తగా గ్రయిండ్ చేసి మొహానికి రాసి,అరగంట అలా వదిలేసి కడిగేస్తే చర్మం మృదువుగా అయిపోతోంది.