చండీగఢ్ కు చెందిన మన్ కౌర్ వృద్దుల అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో అడుగుపెట్టి రికార్డులు సొంతం చేసుకుంది. తాహాగా స్పెయిన్ లో జరిగిన ఓ పోటీలో కూడా బంగారు పథకాన్ని సాధించింది. ఆమె వయసు 102 సంవత్సరాలు. 2017లో వరల్డ్ మాస్టర్స్ గేమ్ లో 100మీటర్ల పరుగును ఒక నిమిషం 14 సెకన్లలో పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 20 పైగా పథకాలు సాధించారు ఆమె. రన్నింగ్,లాంగ్ జంప్,షాట్ పుట్,జావెలిన్ త్రో, వాకింగ్ లో అంతర్జాతీయస్థాయిలో వృద్దుల ఒలంపిక్స్ లో పథకలు సాధించింది. ఈమెను మిరాకిల్ ఫ్రమ్ చండీగఢ్ అని పిలుచుకుంటారు.