డెస్క్ వర్క్ చేసినప్పుడు అస్తమానం మోచేతులు టేబుల్ కి ఆనించటం వల అక్కడంతా నల్లగా అయిపోతుంది. ఈ మోచేతుల నలుపు వదిలించటం కాస్త కష్టమే. కానీ రెగ్యులర్ గా ఈ ఇంటి చిట్కాలు ఉపయోగించి ఆ నలుపు పోగొట్టచ్చు. సెనగపిండి పెరుగు కలిపి ప్రతిరోజు స్నానం చేసే ముందర మోచేతులకు పట్టించి కాసెప్పాయాక కడిగేస్తే ఆ నలుపు నెమ్మదిగా తగ్గిచర్మంలో కలిసిపోతుంది . అలాగే దోసకాయ బొప్పాయి గుజ్జుగా చేసి రాసినా సరే. ఒక టేబుల్ స్పున్ గంధంలో రెండు స్పూన్ల తేనే వేసి పేస్టులా కలపాలి . దాన్ని ఆరిపోయే దాకా మోచేతులు రాసి వదిలేసి తర్వాత కడిగేస్తే ఫలితం బావుంటుంది. ఈ మిశ్రమం మోచేతులు రాసి కనీసం అరగంట ఉంచుకోవాలి . పంచదార ఆలివ్ ఆయిల్ పేస్ట్ లా చేసి ఆ మిశ్రమం తో నలుపు ఉన్న భాగంలో మస్సాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. ఏ చిట్కాలు ప్రతి రోజు చేస్తే ,మంచి ఫలితం ఉంటుంది. నలుపు తప్పకుండా పోతుంది.
Categories