భూపాల్ లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన అనిత విదేశాల్లో స్థిరపడాలని కోరికతో వచ్చిన సంబంధాలు అన్నీ తిరస్కరిస్తూ ఉంటుంది.పొరుగునే ఉండే    పుష్పెంధర్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చి పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నాడు అని తెలుస్తుంది తల్లికి కట్నం పైన ఆశ చివరకు దుబాయి లో అయినా పర్వాలేదు అనుకుని అనిత పుష్పెంధర్ ను పెళ్లి చేసుకుంటుంది.పెళ్లయ్యాక పుష్పెంధర్ దుబాయ్ వెళ్లడం లేదని స్వదేశంలోనే ఉద్యోగం వెతుక్కుంటున్నారని అనితకు, ఇటు తనను ఏమాత్రం ఇష్టపడకుండా కేవలం దుబాయ్ మోజులోనే తానను పెళ్లాడిందని తెలిసిపోతుంది. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించు కొని విడిపోదాం అనుకొంటారు కానీ ఎవరికి వాళ్లకు  వాళ్ల అంతరాత్మ ఉంటుంది విచక్షణ ఉంటుంది చేసిన పొరపాటు సరిదిద్దుకునే అవకాశం జీవితం ఇస్తుంది అలా ఇద్దరూ తమ పొరపాట్లు తెలుసుకుని జీవితాన్ని కొనసాగించటం సినిమా కదా. నెట్ ఫ్లిక్స్ లో ఉంది సినిమా చక్కని కామెడీ డ్రామా.
రవిచంద్ర.సి 
7093440630

Leave a comment