Categories
క్లీన్ ఈటింగ్ గురించి కొన్ని క్లాసులు చెప్పుతుంటారు అంటే పరిశుబ్రంగా ప్లాటు లో ఏవీ మిగలకుండా తినేయడం కాదు. సరైన ఆహార పదార్ధాలు తినండి అని అర్ధం. పూర్తి కూరగాయలు, పూర్తి ఆహార ధన్యాలు తీసుకోవాలి. ఉప్పు లేని నట్స్ గింజలు తినాలి. ప్రాసెస్డ్ పదార్ధాలు వద్దనే చెప్పాలి. రిఫైన్డ్ చక్కర పదార్ధాలకు దూరంగా వుండాలి. చక్కెర బదులుగా తియ్యగా వుండే ఏ ప్రత్యామ్నాయం తిన్నా అది చక్కర లాంటిదే అవుతుంది. రోజు మొత్తంలో ఐదారు సార్లు ఆహారం తీసుకోవాలి. ఒకేసారి కడుపు నిండా తినడం తప్పే. తినే భోజనంలో వీలైనన్ని పోషకాలుండేల శ్రద్ధ తీసుకోవాలి. అనారోగ్యాన్ని తెచ్చి పెట్టే కొవ్వులు, తేపి వస్తువులు ఉప్పుకు కాస్తా దూరంగా వుంటూ. ఇంట్లో వుండే పదార్దాలే తీసుకోవాలి. ఇదే క్లీన్ ఈటింగ్ అంటే.