జయ జయ నిమిషాంబిక..జయ జయ జననీ!!

 

త్రిశక్తి అవతారంగా ఉద్భవించి సకల జనుల సౌభాగ్యాన్ని కాపాడే జగజ్జనని,లోక పావని నిమిషాంబికా దేవి.
బోడుప్పల్ సమీపంలో వెలసిన నిమిషాంబ అమ్మవారి దర్శనం చేసుకుని కటాక్షం పొందుదామా!!
అత్రి మహర్షి, అనసూయ దేవి తపస్సు ఫలితం ముక్త మహర్షి జననం.ముక్త మహర్షి లలితా దేవి యఙ్ఞ సత్ఫలితమే మనం ఇప్పుడు  ఆరాధిస్తున్న తల్లి. ముక్త మహర్షి యాగం తలపెట్టిన శుభ ముహూర్తంలో యజ్ఞంలో నుంచి ఆదిశక్తి నిమిషంలో  ప్రత్యక్ష మై తథాస్తూ అంది అందుకే తల్లికి  నిమిషాంబ అని నామకరణం చేసారు.దుష్ట శిక్షణ శిష్ట రక్షణగా భక్తులకు సంతోషాన్ని కలిగిస్తున్న మహాశక్తి ని తప్పకుండా దర్శనం చేసుకోవాలి.
  ఇష్టమైన రంగుల:ఎరుపు, పసుపు, ఆకుపచ్చ
ఇష్టమైన పూజలు:కుంకుమార్చన,చీర,రవిక,గాజులు, పూలు, పండ్లు సమర్పించిన ఆనందంగా కటాక్షం
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు,వడపప్పు(నానబెట్టిన పెసరపప్పని వడపప్పు అంటారు)

 

          -తోలేటి వెంకట  శిరీష 

Leave a comment