నీహారికా,
చాలా మందితో మనం మాట్లాడేటప్పుడు కొన్ని నమ్మకాల గురించి కబుర్లు వింటాం. ఫలానా రోజు మంచి రోజు కాదనీ, డిస్టి తగిలిందన, ముడుపు కడితే అనారోగ్యం పోయిందణీ, ఎవరో ఎదురొస్తే లేదా తుమ్మితే అనుకున్న పని కాలేదనీ విన్నపుడు మనకు విచారంగా వుంటుంది. మనుషులు మూఢనమ్మకాలకు ఎంత బానిసలా అనిపిస్తుంది. ఇవన్నీ అర్ధం లేని ఆలోచనలని మనకు తెలుసు. మొహమాటానికి వింటాం, చూస్తూ వురుకుంటాం, ఇప్పుడు ఆలోచిస్తేఅంటి మూఢనమ్మకాలని ప్రశ్నించడం గానీ, హేతువు తోఆడించడం గానీ మానేసి తప్పు చేసామనిపిస్తుంది. మనకెన్నో శక్తి యుక్తులున్నాయి. వాటిని సరిగాపయోగించక ఇలాంటి నమ్మకాల వెనుక పడటం అంటే నష్టపోవడమే గా అందుకే ఇప్పటి నుంచి ఓ పని చేద్దా. పని కట్టుకుని ఇలాంటి నమ్మకాల వల్ల కలిగే నష్టం ఏమిటో చెప్పుతూ వద్దాం. వినరేమోనన్న సందేహం వద్దు. వినేలా చేద్దాం, మన చుట్టూ ఒక్కళ్ళు ఇద్దరు మారినా మంచిదే.