వ్యాయామం జీవిన విధానంలో భాగం అయితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఊపిరిపీల్చటం ఎంత ముఖ్యమో వ్యాయామం అంతే ముఖ్యం అనుకోవాలి. వ్యాయామానికి ముందు వార్మప్ ఎక్స్ ర్ సైజలు తప్పని సరి చేయాలి. వ్యాయామానికి శరీరాన్నీ సిద్ధం చేయాలి. తేలికపాటి కార్డియో వాస్క్యులర్‌ వ్యాయామాలతోపాటు స్ర్టెచింగ్‌ వ్యాయామాలు వార్మప్‌లో ఉండాలి . ఇది 20 నిమిషాల నుంచి అరగంట సేపు ఉండాలి. ఈ వార్మప్ రక్తనాళాలను వెడల్పు చేసి, కండరాలకు రక్తప్రసారం ద్వారా ఆక్సిజన్‌ అందేందుకు తోడ్పడుతుంది. ఫ్లెక్సిబిలిటీ పెరిగి, సమర్ధంగా పని చేసేందుకు తగినట్టుగా కండరాల ఉష్ణోగ్రతను పెంచుతుంది. వార్మప్‌తో గుండె వేగం నెమ్మదిగా పెరగడం వల్ల గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది.

Leave a comment