కామెడీ రాయటం, సినిమాగా తీయటం రెండు కష్టమే ఆ సినిమాల్లో కథే హీరో. 2001లో పుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ‘మై వైఫ్ ఈజ్ ఏ గ్యాంగ్ స్టార్’ సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. ఈ కొరియన్ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే దీన్ని తెలుగులో కూడా కాఫీ కొట్టారు.ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తెలియక ఒక గ్యాంగ్ స్టార్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. తిరుగులేని శక్తిగా నేర సామ్రాజ్యంలో వెలిగిపోతున్న ఈ అమ్మాయి తనను పెంచిన అక్క చివరి కోరికగా తాను ఇల్లాలు అవ్వాలనుకుని తన గ్యాంగ్ వాళ్ళని తనకు మంచి భర్తను వెతకమంటే ఈ మాములు అబ్బాయి దొరికాడు. కాని ఇతనిలో గొప్ప ప్రేమికుడు దాగిఉంటాడు. వీళ్ళ కథ ఎలా మలుపులు తిరుగుతూ నవ్విస్తుందో సినిమా చూడాలి. దర్శకుడు బో జింగ్యూ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం అప్పట్లో 30 మిలియన్ డాలర్లు వసూళు చేసి రికార్డు సృషించింది. సరదాగా సినిమా చూడండి.

Leave a comment