Categories
భార్య భర్తల మధ్య కోపాలు వాగ్వాదాలు జరగడం మాములే ఎవరో ఒకళ్ళు సర్దుకుపోతారు.మాములుగా జీవితం గడిచిపోతూ ఉంటుంది. కాని ఆ కాస్త సమయంలో ఇంట్లో ఉండే సరిగ్గా ఊహరాని పిల్లలు మాత్రం ఈ వాతావరణానికి బెదిరిపోతారు.ఒక్కోసారి అమ్మ,నాన్న విడిపోతారెమో అన్న భయంతో వణికిపోతారట.ఇద్దరు ఎడమొహం,పెడ మొహంలో ఉన్న పిల్లల్లో కలిగే ఒత్తిడి అంతా ఇంతా కాదు. వాళ్ళకు మనసులో దిగులు ,చదువుల్లో ఏకాగ్రత పోతుంది. ఇవన్ని దృష్టిలో ఉంచుకుని పెద్దవాళ్ళు తమ తగువులు,అసంతృప్తితో పిల్లల దగ్గరకు రానివ్వద్దు అంటున్నారు. మీలో మీరు మాట్లాడుకుని పిల్లల దగ్గరకు రానివ్వద్దు అంటున్నారు. మీలో మీరు మాట్లాడుకోని ఒక అంగీకారానికి రండి అంతేగాని మీ ఆవేశాలు పిల్లల ముందు ప్రదర్శించకండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.