మూడు దేశాల తొలి మహిళా వైద్యుల ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఇండియా కు చెందిన డాక్టర్ ఆనంది బాయ్, జపాన్ కు చెందిన డాక్టర్ ఒకామి, సిరియా కు చెందిన డాక్టర్ సబత్ తో దిగిన 135 ఏళ్లనాటి ఫోటో అది. ఆ ఫోటోలోని ముగ్గరు వైద్యులు మెడిసిన్ చదివింది ఒకే కాలేజీలో ఆ కాలేజీ స్థాపించింది. అమెరికాకు చెందిన బ్లాక్ వెల్ ఈ ముగ్గురి లాగే ఆమె కూడా అమెరికాకు చెందిన మొదటి మహిళా వైద్యురాలు కావటం విశేషం .ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో లో ఉన్న ముగ్గురు ప్రఖ్యాత ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియా  లో చదువుకున్నారు ఇది కూడా తొలి మహిళా వైద్య కళాశాలే. 173 ఏళ్ళనాటి ఆ కాలేజీ పేరు ఎప్పుడు డ్రెక్సెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్.1886 లో ఈ ముగ్గురే వైద్య విద్యార్థినులు అందుకే ఇది అంతటి అపురూపమైన చిత్రం అయింది. మన దేశానికి చెందిన ఆనందీ బాయి 1886 లో మెడిసిన్ పూర్తి చేసేసరికే ఆమెకు టి.బి వ్యాధి ఉంది .ఆ కారణంగా ఆ తర్వాత ఏడాదికే ఆమె మరణించారు భారతదేశపు తొలి వైద్యురాలే  అయినా వైద్య సేవలు అందించేందుకు అనారోగ్యం ఆమెకు అవకాశం ఇవ్వలేదు .

Leave a comment