Categories
ఒక నారింజ పండులో 13 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. నారింజలో 80 శాతం సి-విటమిన్ ఉంటుంది. వ్యాయామం పూర్తి చేసిన తర్వాత ఈ పండు తిన్నా లేదా నారింజ జ్యూస్ తాగిన కండరాలకు ఎంతో మంచిది. ఇందులో వుండే పొటాషియం మెదడుకు మేలు చేస్తుంది. డిప్రెషన్ లక్షణాలు తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెజర్ ను నియంత్రిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం నారింజ కు ఉంది. కంటి చూపు మెరుగు పడుతుంది. ఒక్క నారింజ పండులో 35 క్యాలరీలు లభిస్తాయి. రోజూ నారింజ పండు తింటే మంచి నిద్ర పడుతుంది.