రోజు పండు తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని రకాల పండ్లు ఆరోగ్యంతో పాటు అందాన్ని రెట్టింపు చేస్తాయి తక్కువ సమయంలో ఈ పండ్లతో వేసుకొనే ఫేస్ ప్యాక్ లో ముఖాన్ని మెరిపిస్తాయి.అవకాడో కివీ మొదలైనవి విదేశీ పండ్లు అయినా మనకు విరివిగా దొరుకుతూనే  ఉన్నాయి.వీటిని మెత్తగా గుజ్జులాగా చేసుకోవాలి.ఈ మిశ్రమానికి కొంచెం తేనె, పాలు, పెరుగు కలిపి మొహం,మెడకు ప్యాక్ లాగా వేసుకొంటే చాలు ఓ పావుగంట తర్వాత నీటితో కడిగేసుకోవాలి ఇలా వారం లో రెండు సార్లు ఈ ఫ్రూట్ ప్యాక్ వేసుకుంటే ముడతలు, చారలూ పోతాయి. చర్మం కాంతి వంతంగా ఉంటుంది.

 

Leave a comment