ఇంట్లో సభ్యులందరికీ చక్కని పోషకాహారం అందించే గృహిణులు తమ ఆరోగ్యం దగ్గరకు వచ్చే సరికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు .ఎన్నో పనులతో శారీరకంగా, మానసికంగా అలిసిపోయే స్త్రీలకు కీలకమైన పోషకాలు తప్పనిసరి ముఖ్యంగా ఈ కరోనా సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం ఆమె తీసుకొని తీరాలి. ఆమెకు సరైన డైట్ అవసరం కూడా .మహిళలు తమ ఆహారం లో ఆలివ్ ఆయిల్ ను  చేర్చుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఇందులో ఆరోగ్యవంతమైన మెనో అన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అలాగే ప్రతిరోజు టమోటాలు తినాలి రోజుకు కావలసిన విటమిన్-సి టమాటాల్లో లభిస్తుంది .చర్మానికి మంచి మెరుపును నిగారింపును ఇస్తాయి. టమాటాల్లో ఓట్స్ లో లభించే ఫోలిక్ యాసిడే పోషకాల నిధులు .గుండెని ఫిట్ గా ఉంచుతాయి అరటి పండులో వుండే ట్రిప్టోఫాన్ మూడ్ స్వింగ్స్ ని బయటపడేస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండి నాడీవ్యవస్థకు ఊతంగా ఉంటుంది. కప్పు బ్రకోలి లో క్యాల్షియం, మాంగనీస్, పొటాషియం, పాస్ఫరస్, మెగ్నీషియం ఉంటాయి .దానిమ్మ పండు లో హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచుకోవచ్చు. సోయా మంచి డైటరీ ప్రోటీన్.   గుడ్డులో ఉండే కొలైన్ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తపోటు స్థాయిల్ని తగ్గిస్తాయి . మంచి మూడ్ ఇస్తాయి. సల్మాన్ టునా వంటి చేపల్లో ఉండే ఒమెగా-3 40 ఏళ్లు దాటిన స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

Leave a comment