గేదెలు,ఆవులు ఈనిన తర్వాత మొదటి నాలుగు రోజుల పాటు జున్ను పాలు ఇస్తాయి. ఆ పాలల్లో బెల్లం ,మిరియాల పొడి వేసి జున్ను తయారు చేసే వాళ్లు . ఆప్పుడు పట్టణాల్లో అలా జున్ను పాలు దొరికే దారిలేదు. అందుకే కొన్ని కంపెనీలు జున్ను పాలను పొడి రూపంలో ,రెడీమేడ్ గా పాక్ చేసి అమ్ముతున్నారు. ఈ జున్ను పాలల్లో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు ,అత్యధిక సంఖ్యలో ప్రోటీన్లు ,విటమిన్లు ఖనిజాలు ఉంటాయి. ఇంకా లాక్టో ఫెరిన్ ,హెమోపెక్సిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఫుష్కలంగా ఉన్నాయి. జున్ను పాలు సహజమైన యాంటీ బయోటిక్ , పిల్లలకీ పెద్దలకీ జున్ను పాలు మంచి ఆహారం. ఇప్పుడు ఈ జున్ను పాలను ,పొడి రూపంలో చాక్లెట్లు బిస్కెట్లు ,సిప్లీమెంట్స్ గా కూడా విక్రయిస్తున్నారు. కొలెస్ట్రమ్ మిల్స్ అని సర్చ్ చేస్తే ఎన్నో వెరైటీలు ఉన్నాయో చూడవచ్చు.

Leave a comment