ఉదయం ఎండలో పదిహేను నిముషాలు ఉండగలిగితే ఎవరికి వాళ్లు ఆరోగ్యానికి మేలు చేసుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండ కారణంగా చర్మం పై పొరలోని నైట్రిక్ ఆక్సైడ్ చురుగ్గా మారి రక్త నాళాలను వెడల్పుగా చేస్తుంది. దీనితో రక్తప్రసరణ మెరుగై బీపీ తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారు కాసేపు ఎండలో ఉంటే వారిలో నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ స్రావం పెరుగుతుంది విటమిన్-డి కేవలం ఎముకల కే కాదు ఇన్సులిన్ స్రావాన్ని పెంచటం ద్వారా మధుమేహం రానివ్వదు చలికాలంలో వచ్చే సీజనల్ డిజార్డర్ లని డిప్రెషన్ వంటి వాటిని తగ్గించే శక్తి సూర్యరశ్మి కి ఉంది.

Leave a comment