స్పినాక్ అనేది ఒక ఆకుకూర. చుక్క కూర ఆకులను పోలివుండే స్పినాక్ లో పూర్తిగా పోషకాల పదార్ధాలే. ఇందులో కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణముంది. పైగా పలురకాల కాన్సర్ కారకాలను నిరోధించే రసాయనాలున్నాయి. స్పినాక్  శిరోజాలకు చర్మానికి మేలు చేస్తుంది.దీనిలో  బీటా కెరోటిన్ విటమిన్ ఎ లు  కళ్లకు మేలుచేస్తుంది. వయసులో మందగించే చూపును స్పినాక్  మెరుగుపరుస్తుంది. దీనిలో పీచు పదార్ధం వల్ల  మలబద్దక సమస్యలు తలెత్తవు. స్పినాక్ ఆకులు ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. రోటీ పరోటాలతో పప్పు సలాడ్ గా ఈ స్పినాక్ ను తీసుకుంటే మేలు. లేతగా ఉండే స్పినాక్ ఆకులను తొమ్మిది రోజుల పాటు ఫ్రిజ్ లో జాగ్రత్తగా స్టోర్ చేసి ఇందులో వుండే పోషక విలువలు ఏవీ నశించవు. న్యూట్రీషన్స్ పుష్కలంగా వుండే ప్రపంచపు ఆరోగ్యకరమైన కూరగాయల్లో స్పినాక్ టాప్ ర్యాంకింగ్ లో ఉందంటారు. న్యూట్రీషనిస్టులు. ఒక్క నిమిషం పాటు ఉడికించి ఇందులో వున్న  పోషకాలు రుచీ పోకుండా తినమంటున్నారు. వారంలో రెండుసార్లు కుటుంబమొత్తం తీసుకునే భాగంగా ఈ ఆకు కూరను ఎంచుకోమని కనీసం ఒక కప్పు తక్కువ కాకుండా ఈ కూర తినమనీ  డైటీషియన్లు సలహా.

Leave a comment