అలసట అనిపిస్తే కప్పు టీ తాగితే ఎక్కడలేని శక్తి వస్తుంది. ఒత్తిడి మాయమై గొప్ప రిలీఫ్ వస్తుంది. ఈ  ప్రయోజనాలను మించిన ఉపయోగం మరొకటుంది. కప్పు  టీ తో మెదడు అరగంటకు పైగా చురుగ్గా పనిచేస్తుందని కొన్ని పరిశోధనల ఫలితం చెపుతోంది. గ్రీన్ బ్లాక్ టీ లు తగిన అనంతరం  మెదడు పనితీరు చాలా చైతన్యవంతంగా ఉందిట. ముందుకన్నా చురుగ్గా ఆలోచించటం త్వరత్వరగా నిర్ణయాలు తీసుకోవటం  పరిశోధకులు గమనించారు. టీ తాగటం వల్ల  మెదడులోని మూడు రకాల  బ్రెయిన్ వేవ్స్ చాలా చురుగ్గా పనిచేస్తాయి. అలాగే లైట్ టీ తో ఊబకాయ సమస్య మాయమైపోతుంది. లైట్ టీ  కొత్తగా ఏర్పడే ఫ్యాట్ సెల్స్ ని అడ్డుకుంటుందని ఇది యాంటీ  ఆక్సిడెంట్లు కనుక చర్మం  చాలా అందంగా అయిపోతుందనీ  వృధాప్య ఛాయలు పూర్తిగా పోతాయని చెపుతున్నారు. అల్ట్రా వయొలెట్ కిరణాలతో నల్లబడిన చర్మం వెంటనే యాధస్థితికి వస్తుంది. ప్రాసెస్ చేసి టీ బ్యాగ్స్ లో భద్రపరిచిన లైట్ టీ  లీవ్స్ కంటే విడిగా వుండే ఆకులతోనే మంచి ఔషధ విలువలున్న టీ తయారు చేసుకోవచ్చు. ఈ వైట్ టీ ని ప్రతిరోజు తీఉస్కోవటం వల్ల  ఎన్నో ప్రత్యక్ష పరోక్ష లాభాలుంటాయంటున్నారు

Leave a comment