అమ్మాయిలు కాస్త బొద్దుగా అవుతొంటేనే కొంపలు మునిగినట్లు హడావుడిచేస్తారు. డైటింగ్ తో వార్నింగ్ లతో కాస్త కండ కరిగేలా కష్టాలు పెడతారు..మౌరిటానియా దేశంలో వుండే అమ్మాయిలు లావుగా మారేందుకు ఫాటెనింగ్ ఫార్మ్స్ కు వెళతారు. అమ్మాయిలకు అదే పనిగా తినిపించి,తాగించి అభ్యంతరం పెడితే కఠిన శిక్షలు అమలు చేస్తారంట. కనీసం 140 కిలోల బరువుంటేనే వాళ్ళకు పెళ్ళి లేకపోతే అబ్బాయిలు కన్నెతికూడా చూడరు. పూర్వకాలంలో ఈ మరాటానియా ఆఫ్రికా దేశాల్లో ధనవంతులకు కొలమానుం అంతే లావుగా ఉన్న భార్య ఉండటమే . ఏ పని చేయకుండా తినటం కూర్చోవటం పడు కోవటం వంటి పనులు చేసే భార్య ఉన్న వ్యక్తిని గోపా వ్యక్తి అత్యంత ధనవంతుడని అని గర్వించేవాళ్ళు. ఇంకా ఇప్పటికి అదే ఆచారం నమ్మకం అయి కూర్చుంది. అమ్మాయిల పాలిట శిక్ష అయింది. బరువు పెరిగేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు కంట్రా సెప్టిల్స్ కార్టీ కాయిస్ స్టెరాయిడ్ హార్మోన్స్ తీసుకుంటే ఈ అందం మాట దేవుడెరుగు ముందు ఆరోగ్యం ఆమడ దూరం పారిపోతుంది.

Leave a comment