నెల్లూరు జిల్లాలోని తూర్పు కనుపూర్ సమీపంలో వెలసిన గ్రామదేవత మన ముత్యాలమ్మ తల్లి.
త్రిశక్తి రూపిణియైన తల్లి పార్వతి దేవి అంశం. చేతిలో ఢమరుకం,త్రిశులంతో దర్శనం ఇస్తుంది.ముత్యాలమ్మ ఆలయంలోకి ప్రవేశించగానే త్రిశూలానికి పూలదండ, పసుపు,కుంకుమ,నిమ్మకాయలను,గాజులతో పూజించి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు భక్తులు.
ముత్యాలమ్మ తల్లికి ప్రతి ఆదివారం,మంగళవారం,శుక్రవారం పొంగళ్ళు,పసుపు నీళ్ళతో మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. గర్భగుడిలో అమ్మవారి పాదాలు ఒక రాక్షసుడిని తొక్కి పట్టిన భంగిమలో కూర్చొని ఉంటుంది.ఆ రాక్షసుడు అన్యాయానికి ప్రతీక అని భక్తుల విశ్వాసం.ఆ ఊరి ప్రజలను తన చల్లని చూపుతో రక్షించే అమ్మ అని బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుపుకుంటారు.
ఇష్టమైన పూలు: అన్ని రకాల పుష్పాలు.
ఇష్టమైన రంగుల: ఎరుపు, పసుపు
ఇష్టమైన పూజలు: పసుపు నీళ్ళతో, పొంగళ్ళతో మొక్కులు తీర్చుకోవడం.
నిత్య ప్రసాదం: కొబ్బరి, నిమ్మకాయల దండ,పొంగలి.
పొంగలి తయారీ: పాలు మరిగిన తరువాత బియ్యం కడిగి అందులో వేసి తగినంత బెల్లం వేసి ఉడికించి వేయించిన జీడిపప్పు,కిస్మిస్ కలిపి అమ్మవారికి నైవేద్యం సమర్పయామి.
-తోలేటి వెంకట శిరీష