రసాయనాలు వాడకుండానే చర్మం మెరిసిపోయేందుకు మన వంటగదిలో సామాన్యంగా మనం ప్రతి రోజూ
వాడే వస్తువులు పనికి వస్తాయి. సాధారణంగా మనం ఉదయాన్నే నిమ్మరసం తేనె కలుపుకోని తాగితే మంచిది అనుకంటాం . ఆ తేనె సహాజమైన యాంటీసెప్టిక్ .ముఖం ,మెడకు ఈ తేనె పట్టించి పావుగంట తర్వాత కడిగేయవచ్చు. ఆలాగే శనగపిండి పెరుగు కలిపి అప్లైయ్ చేస్తే ఎండకు ఏర్పాడే టాన్ పోయి చర్మం మెరుస్తుంది.గుడ్డు సొన ఏమీ కలపకుండా నేరుగా అప్లైయ్ చేసి ఆరిపోయాక కడిగేస్తే చర్మం బిగుతుగా ఉంటుంది. కొబ్బరి నూనె మేకప్ రిమూవర్ గా వాడు కోవచ్చు .తేనె నిమ్మరసం కూడా మొహాంపై రాసి ఆరాక కడిగేస్తే మొహాం మెరుస్తుంది.ఇది రాత్రి వేళ ముక్కుపై రాసి పడుకొని ఉదయాన్నే కడిగేస్తే ముక్కుపై వచ్చే బ్లాక్ హెడ్స్ పోతాయి.

Leave a comment