నారిశక్తి పురస్కారం అందుకోంది కొల్లం లోని పారాకురం ప్రాంతానికి చెందిన భగీరధీ . చదువుకోవటం ఆమె చిన్ననాటి కోరిక . వివాహం ,పిల్లలు కలగటంతో ఆ కోరిక వాయిదా పడింది . అయినా ఆమె నిరాశపడలేదు . 105 సంవత్సరాల వయసులో నాలుగో తరగతి పాసైపోయ్యారు భగీరథి అమ్మ. మాది మధ్యతరగతి కుటుంబం . మా అమ్మ నా తొమ్మిదవ ఏటా చనిపోయింది స్కూలు మానేసి తోబుట్టువులను చేసుకొన్నా . పెళ్లయ్యాక పిల్లలు కలిగాక నా భర్త చనిపోయారు . పిల్లల భాద్యత తీసుకోవలసి వచ్చింది. 105 సంవత్సరాలు  వచ్చాయి . చిన్నపుడు మా అమ్మ నన్ను అస్తమానం చదువుకోమనేది . ఆమె కోరిక తీర్చాలనుకొని ఇప్పుడు చదువు మొదలు పెట్టి నాలుగో తరగతికి హాజరై 74.5 శాతం మార్కులతో పాసై పోయాను . మా రాష్ట్రంలో ఈ వయసులో పరీక్ష రాసిన మొదటి మహిళను నేనే అంటోంది భగీరథి  గర్వంగా ఆమెకు శుభాకాంక్షలు .

Leave a comment