తుఫాన్ తో ఒక్క రోజే ముంబైలో వందలాది చెట్లు నేలకూలాయి.పర్యావరణానికి ప్రాణమైన చెట్లు కూలిపోతే జరిగే హాని ఇంకా వేగం పుంజుకుంటుంది అంటూ ఆందోళన పడ్డారు సుమైరా అబ్దుల్ అలీ .ఆవాజ్ పౌండేషన్, మిత్ర సంస్థల వ్యవస్థాపకురాలు.59 ఏళ్ల సుమైరా వివిధ వేదికల ద్వారా పర్యావరణానికి జరిగిన నష్టాన్ని ప్రజలకు తెలియజేస్తారు.వాటి నివారణ మార్గాలు సూచిస్తారు 2004 లో ఇసుక మాఫియా తనపై జరిపిన దాడిలో ఉద్యమకారులు రక్షణ కోసం దేశంలో మొట్టమొదటిసారిగా నెట్వర్క్ ను ఏర్పాటు చేశారు ముంబై వాసి సమైరా అబ్దుల్ అలీ. ప్రకృతి చెప్తున్నా పాఠాల లు అర్థం చేసుకుంటేనే మానవ మనుగడ అంటారు సమైరా.