ప్రతి నిమిషం నిత్య నూతనంగా ఉండాలని ,సృజనాత్మకంగా పని చేయాలని ఆశించే శృతి హాసన్ సంగీతంలో ఇంకోసారి తన గొంతు వినిపించబోతుంది.ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్రోడ్యుజర్ న్యూక్లేయాతో కలిసి ఈ ఆల్బమ్ కోసం పని చేస్తోంది శృతి.పూర్తిగా ఉత్తేజ భరితంగా ఉండే ఈ పనిని న్యూక్లేయా కొలబరేషన్ తో చేయటం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది . ఆయన పని అంటే నాకు చాలా ఇష్టం.ఇప్పుడు అతనితో కలిసి పని చేయటం అంటే ఇది నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్న అని చెప్తోంది శృతిహాసన్.న్యూక్లేయాగా ప్రసిద్ధుడైన మ్యూజిషియన్ ఉద్వాన్ సాగర్ శృతి విషయంలో ఎన్నో ప్రశంసలు కురిపించారు. ఆమె నటి,గాయని మాత్రమే కాదు గొప్ప లిరిక్ రైటర్. మేమిద్దరం కలిసి పని చేస్తున్నా ఆల్బమ్ కోసం ట్రాక్ మొత్తం శృతినే రాసింది. ఆమెలో పని చేటయం నాకు గౌరవం అంటున్నాడు న్యూక్లేయా.
Categories