Categories
ఒత్తయిన జుట్టు కోసం కొన్ని హోమ్ రెమెడీస్ ఉపయోగపడతాయి.95 శాతం కెరోటిన్, 18 రకాల అమైనో యాసిడ్ లతో శిరోజాలు తయారు అవుతాయి కనుక డైట్ లో తగినంత ప్రోటీన్ లభించేలా చూసుకోవాలి. ఐరన్, కాపర్ పుష్కలంగా ఉండే బార్లీ నీళ్లు తాగాలి. బార్లీ గింజలు నీళ్లతో మరిగించి కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఓ టీ స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్ళలో నాననిచ్చి ఉదయాన్నే ఈ నీళ్లు తాగాలి. మెంతుల్లో పోలిక్ యాసిడ్ విటమిన్-కె ,విటమిన్-ఎ, విటమిన్-సి ,పొటాషియం, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి.