వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర తక్కువైపోతుంది అలా నిద్ర పట్టని వారి కోసం తయారయ్యిందే సౌండ్ స్లీప్ మిషన్. ఓకే స్థాయిలో వచ్చే కొన్ని శబ్దాల వల్ల నరాలకు స్వంతన లభించి నిద్ర పట్టేలా చేస్తుంది అంటారు ఈ మెషిన్ తయారీదారులు.అందుకోసం జలపాతం గాలి వర్షం వంటి కొన్ని రకాల శబ్దాలు రికార్డ్ చేసి ఈ మిషన్ లో ఉంచారు. అందులో నచ్చిన దాన్ని వింటూ ఉంటే హాయిగా నిద్ర పట్టేస్తుంది. టైమ్ సెట్ చేసి పెడితే మిషిన్ దానంతట అదే ఆగిపోతుంది. ఈ మిషన్ లు నిద్రలేమితో బాధపడే వారికి గొప్ప వరం అంటున్నారు తయారు చేసిన వాళ్లు.

Leave a comment