
గతంలో వున్న కుటుంబ వాతావరణంలో పిల్లలకు క్రమశిక్షణ, మంచి అలవాట్లు, నిద్రా సమయం, భోజన సమయం అంటూ వుండేవి. ఇప్పిడా పరిస్థితి లేదు. తల్లిదండ్రులకు పరుగులెత్తే ఉద్యోగాలు, పిల్లలకు వత్తడి తెచ్చే వాతావరణంఎక్కువ కాలరీలున్న భోజనం, తియ్యని డ్రింకులు, తల్లిదండ్రుల కోసం ఎదరు చూస్తూగంటల కొద్దీ టీ.వి ల ముందు కూర్చోవడం పెద్దలతో సమానంగా నిద్ర ఇవన్నీ పిల్లల్ని ఉబకాయం వైపుగా లాగుతున్నాయి. తొందరగా తిని తొందరగా నిద్ర పొతే ఈ సమస్య వుండదు అంటారు పరిశోధకులు. కోరుకున్న స్థాయిలో లేదా అవసరమైనంత నిద్ర పోయేవారుతినే తిండి కంటే తక్కువ క్యాలరీలు తీసుకుంటారు. ఈ నిద్ర తోనే పిల్లల్లో తిండి పరిమాణం తగ్గడం గమనించారు. మితిమీరిన బరువు వల్లన వచ్చే బద్ధకం కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల కూడా శ్రద్ధ తక్కువై పోతుంది. తల్లిదండ్రుల గారాబం వల్లనే పిల్లలకు జంక్ ఫుడ్ తినడం ఎక్కువ అయ్యింది అని, పిల్లల క్షేమం కోరితే ముందుగా వాళ్ళ ఆహారం, నిద్ర, ఆటలాడే వేళల పైన దృష్టి పెట్టాలని పరిశోధనలు గట్టిగా చెపుతున్నాయి.