సినిమాల్లో కత్తి పట్టీ యుద్ధం చేసిన, ఆకాశంలో చక్కర్లు గొట్టే హెలీకాప్టర్ పై నుంచి దుకినా అక్కడ వందల మంది టెక్నీషియన్లు, ఫైట్ మాస్టర్ల సాయం వుంటుంది కానీ నిజ జీవితంలోనూ అలాంటి సాహసాలు చేసేవాళ్ళుంటారా? హాలీవుడ్ హీరోయిన్ ఏంజలీనా జోలీ వెంటనే ‘ఎస్’ అంటూ మండుకొస్తుంది. ఈ అమ్మాయికి బిడియం, భయం అనే పదాలకు అర్ధంకుడా తెలియదట. గ్లామర్ పాత్రల్లో హడావుడి చేసినా, సహస క్రీడలో దూకుడు తనం చేసినా ఒకే తీరు. యాక్షన్ చిత్రాల్లోకుడా డూప్ లేకుండా గన్ పట్టుకుని పోరాటాలు చేసింది. నిజ జీవితాల్లోనూ అలాగే ఉంటుందిట జోలి. విమానం ఎక్కి పైలెట్ సీట్లో కుర్చుని జోరుగా నడిపెస్తుంది. ఆమెకు పైలెట్ సర్టిఫికెట్ వుంది. అందరు కుక్కల్ని పెంచుకుంటే జోలీ చిన్నప్పుడు పాముని పెంచుకుందిట. అలాగే ఓ బుల్లి ఎలుక కుడా జాలీ పెంచిన పెంపుడు జంతువుల లిస్టు లో వున్నాయిట.

Leave a comment