వంట పనులు ఇంటి పనులతో చేతులు సున్నితత్వం పోగొట్టుకంటే బంగాళ దుంపలు ఉడికించి పేస్టూ చేసి రాస్తూ వుంటే మెత్త బడి పోతాయి. గొంతు బాగోకపొతే మిరియాల పొడి బెల్లం కలిపి ఉండలాగా చేసి నెమ్మదిగా చప్పర్స్తూ తినాలి. అనార్ దానా అంటే ఎండు దానిమ్మ గింజలు. కూరల్లో గ్రేవీ పలుచగా అయిపోతే అనార్ దానా పొడి వేస్తె చిక్కగా అయిపోతుంది. చాట్, సలాడ్ వంటి వంటకాలకు ఈ అనార్ దానా పొడి తో రుచి, రంగు, పోషకాలు అందుతాయి. ఈ పొడి చేప కూరల్లో సూప్ లో వేస్తె పోషకాలతో పాటు చక్కని రంగు వుంటుంది. భోజన పదార్ధాలకు హోటళ్ళలో ప్రేత్యేక రుచి ఎందుకొస్తుందంటే అక్కడ అన్ని రకాల మసాలాలో వాడే పద్ధతులకు తగ్గట్టు అప్పుడప్పుడు దంచి, రుబ్బి వాడతారు. అల్లం, వెల్లుల్లి, దనియాలు, ఉల్లిపాయలు ఎంత వరకు వేయాలో అన్నీ వాడటం వల్ల కూరలకు ప్రేత్యేకమైన రుచి వస్తుంది. ఇప్పుడు ఇళ్ళలో రెడీమేడ్  పాకెట్ల మసాలా వాడకం వల్లనే అనుకున్న రుచి రాదు.

Leave a comment