Categories
అమెరికన్ క్యాన్సర్ సోసైటీ అధ్యయనంలో విటమిన్ డి లోపంతో బాధపడేవాళ్లలో చాలా మంది పేగు క్యాన్సర్ తో నూ బాధపడుతున్నారట. ఎలాగూ ఎండ సోకని చోటనే కాలక్షేపం చేస్తాము కనుక పాలు,జున్ను ,పుట్టగొడుగులు ,ఆరెంజ్ జ్యూస్, గుడ్డు సొన వంటివి ఆహారంలో చేర్చుకొండి వీటిలోనూ డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కనుక అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అంటున్నారు. ఈ విటమిన్ లోపంతో శారీరకమైన నొప్పులు అలసట,నీరసం ,చిరాకు పెరిగి పోతాయి. అందుకే ఇటు సూర్యకాంతిలోనైనా గడపటం లేకా పుష్కలంగా ఈ విటమిన్ దొరికే ఆహారం అయినా తీసుకొండి అంటున్నారు అధ్యయనకారులు.