నెలసరి సమయంలో అమ్మాయిల మూడ్ ఎలా ఉంటుందో ఒక చిన్న షార్ట్ ఫిలిమ్ లో చూపించారు . ఇప్పటికే ఈ ఫిలిమ్ 37లక్షల మంది చూసారు . సిద్దు ,కీర్తి ఇద్దరు భార్యాభర్తలు . సిద్దు ముఖ్యమైన మీటింగ్ కు వెళుతుంటాడు . కీర్తి చాలా చిరగ్గా ఉంటుంది . సిద్దు పట్టించుకోకుండా కోపంగా వెళ్ళిపోతాడు . దారిలో ఫ్రెండ్ కలుస్తాడు . అంతకు ముందు రోజు అతను ఆఫీస్ కు రాకపోకడం వల్ల ఎంతో పని ఆగిపోయిందని సిద్దు విసుక్కుంటాడు . తన భార్య వ్యక్తిగత ఇబ్బందివల్ల రాలేకపోయాను పర్లేదు ఈ రోజు ఆ పని పూర్తిచేస్తాను . ఫ్రెండ్ అనటంతో సిద్దు తన పొరపాటు తెలుస్తుంది . కీర్తి కోసం వెనక్కు పరిగెత్తుకు వస్తాడు . ఆమెను ఓదారుస్తాడు . చాలా సున్నితమైన అంశాన్ని అంత కన్నా సున్నితంగా తీశాడు దర్శకుడు సతీష్ రెడ్డి . యూట్యూబ్ లో ఈ షార్ట్ ఫిలిం ఉంది తప్పక చుడండి .

Leave a comment