అత్యంత సంతోషంగా ఉండే దేశాల్లో ఒకటిగా భూటాన్ గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే భూటాన్ మాతృ స్వామ్య వ్యవస్థను కలిగి ఉన్న దేశం.ఇక్కడ ఆస్తి కుటుంబ విషయాల్లో స్త్రీలదే ముఖ్య స్థానం కుటుంబం సంస్కృతిని కాపాడటంలో కూడా స్త్రీల పాత్ర కీలకమని ప్రభుత్వం కూడా భావిస్తోంది. అందుకే స్త్రీలకు విద్యా అవకాశాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి తెచ్చింది. స్త్రీ, పురుష సమానత్వ భావనతో దేశ శ్రేయస్సు సాధ్యమని భుటాన్ నమ్ముతుంది.