Categories
ఎక్కువ సమయం వ్యాయామం చేసిన డిహైడ్రేషన్ సమస్య వస్తుంది.పోషకాహార నిపుణులు మై 22 బి.ఎం.ఐ వ్యవస్థాపకురాలు ప్రీతి త్యాగి ఏమంటారంటే క్రీడాకారులు, జిమ్ కు వెళ్ళే వాళ్ళు ఎదుగుతున్న పిల్లలు వాటర్ బాటిల్ లో ఉప్పు నిమ్మరసం కలిపిన నీళ్ళు వెంట తీసుకుపోవాలి.ఈ నీళ్లు తాగితే ఎలక్ట్రోలైట్స్ అందుతాయి.కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. నీళ్ళతో పాటు తాజా పండ్లు కూరగాయలు ఎక్కువ శాతం నీళ్లు ఉండే కీరదోస, చిలకడదుంప, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, నిమ్మజాతి పండ్లు తినాలి.గ్లాస్ వేడి నీళ్లలో జీలకర్ర పొడి మెంతి సోంపు తులసి పొడి కలిపి తాగితే ఒంట్లో నీరు తగ్గకుండా ఉంటుంది.