వేసవి తాపం తీర్చేందుకు పుచ్చకాయ ను మించింది ఇంకో ఇంకేదీ లేదు. ఎండలో బయటికి వెళ్లేముందు కాసిన్ని పుచ్చకాయ ముక్కలు తింటే వడదెబ్బ నుంచి రక్షణగా ఉంటుంది. కమిలిపోయిన చర్మానికి పుచ్చకాయ గుజ్జు పట్టిస్తే పూర్వపు కళ వస్తుంది .మిగిలిన పండ్ల కంటే నీటి శాతం ఎక్కువ కాబట్టి బరువు తగ్గాలి అనుకునే వారికి చక్కని ఫలహారం. పుచ్చకాయ లో పుష్కలంగా ఉండే బీటా కెరోనిన్లు,   విటమిన్లు, ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పుచ్చకాయ ముక్కలు తిన్న రసంగా తాగిన ఒకే ఫలితం. వేసవికి రసాయనాలున్న కూల్ డ్రింక్స్ కంటే పుచ్చకాయ జ్యూస్ వంద శాతం ఆరోగ్యకరం.

Leave a comment