కొన్ని మంచి ఆహార పదార్ధాలేనని తెలిసినా అవే తింటూ వుంటే బోర్ కొట్టక తప్పదు. నిజానికి ఓట్స్ చాలా మంచి ఆహారం. తింటే పాలతో తినాలి. లేదా చప్పగా రుచిగా లేక తినాలనిపించదు. నూనెతో చేసిన అల్పాహారం దూరం పెట్టి ఓట్స్ ఇడ్లీ ట్రై చేయొచ్చు. పెరుగు ఇడ్లీ రవ్వ ఓట్స్ కలిపి ఇడ్లీ వేస్తె అచ్చం మాములు ఇడ్లీ లాగానే ఉంటాయి. ఇడ్లీ రవ్వ గుప్పెడు కడిగిపెరుగులో పిండి పడేసి అందులో ఓట్స్ కలిపి ఇడ్లీ వేయొచ్చు. ఇంకా రుచిగా, కేరెట్ తురుము, సన్నగా తరిగిన కూరగాయలు కలిపి వేసుకోవచ్చు. జీవక్రియల రేటు వృద్ది చెందుతుంది. రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇందులోని పీచు జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. ఓట్స్ పాలతో తిన్నా, చక్కర లేకుండా, తాజా పండ్ల ముక్కలు, రసాలు కలిపినా ఎంతో రుచిగా ఉంటాయి. సహజమైన చక్కర లభిస్తుంది. పొట్ట వస్తుందనే భయం కూడా అక్కర్లేదు. కొవ్వు పెరుకోకుండా వుండాలంటే ఓట్స్ ఇడ్లీ బెస్ట్.

 

 

Leave a comment