నాకు ముందునుంచి క్రమ శిక్షణతో ఉండటం మరీ ముఖ్యంగా టైమ్ విషయంలో చాలా ఖచ్చితంగా పాటించటం అలవాటు. సినిమాల్లోకి వచ్చాక అది మరింత పెరిగింది.ఒక్క పూట షూటింగ్ కి లేటైనా, ఆగినా అనుకొన్న సమయానికి షెడ్యూల్డ్ పూర్తి కాకున్న లక్షల్లో నష్టాలోస్తాయి. అందుకే స్ట్రిక్ట్ గా ఉంటా అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ .ఈ పని ఫలానా వాళ్ళే చేయాలి , మనం అసలు వేలు పెట్టకూడదు అనుకోవటం ఇష్షం ఉండదు. ఎవరేనా ఏదైనా చేయాలి ,చేయగలం అవసరమే మనకు అన్నీ నేర్పుతోంది. అలా బద్దకంతోనూ అవసరం లేదనో పనులు పోస్ట్ పోన్ చేయటం, ఆ ఏముందీ రెండు రోజులు,నాలుగు రోజులు గంటలే అనుకొంటారు కానీ రెండు రోజులు,నాలుగు రోజుల విలువ మా సినిమా వాళ్ళకి బాగా తెలుసు. కాలాన్ని పొదుపుగా వాడటం కూడా మాకు తెలుసు .కాలం విలువైంది,వృధా చేయకండి అంటోంది రకుల్ మంచి సలహా కదా?