Categories
బాహుబలి కంక్లుజన్ సక్సెస్ అయ్యాక అందులో అనుష్క ధరించిన నగలు కూడా పాప్యూలర్ అయ్యాయి. రాజమాత శివగామి దేవి ధరించిన భారీ నగలు కూడా అందరి మనసులు దోచుకున్నాయి. అందుకనే అవన్నీ బాహుబలి కలక్షన్స్ పేరుతో, ఆ నగల్ని సినిమా కోసం తయ్యారు చేసిన ప్రఖ్యాత జ్యువెలరి సంస్థ ఆమ్రపాలి. తమ దుకాణాల్లో వెబ్ సైట్ లలో అమ్మకానికి పెట్టారు. ఈ నగల్ని వెండి పైన బంగారు పుత తో, ముత్యాలు, సెమీ ప్రీషియష్ రాళ్ళు, క్రిస్టల్స్ వొడి తయ్యారు చేసారు. గాజులు నెక్లెస్ లు, హారాలు, పాపిట బిళ్ళలు, చెంప సారాలు, వడ్డానాలు, గుళ్ళ దండలు, ముక్కు పుడకలు అన్ని అందుబాటులోకి తెచ్చారు. 600 మొదలుకొని లక్ష లక్షన్నర ఖరీదు చేసే నగలున్నాయి ఇందులో ఏదైనా ప్రత్యేకమైన అకేషన్ వుంటే ఈ నగల్లో చూపు చూడొచ్చు.