Categories
ఒత్తిడి కారణంగా మాడుకు లెక్కలేనన్ని సమస్యలు వస్తాయని అంటున్నారు డాక్టర్లు.మాడు పొడిబారినట్లు అవుతోంది లేదా జిడ్డుగా తయారవుతుంది.దీనివల్ల చుండ్రు దురద వంటి సమస్యలు తలెత్తుతాయి.ఒత్తిడి వల్ల కొర్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతోంది.దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు ఇది చర్మం ముడతలు పడేందుకు కారణం అవుతోంది.ఒత్తిడి కారణంగానే చర్మంపైన యాక్నే తలెత్తుతోంది.ఎగ్జిమా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది ఒత్తిడి కారణంగా శరీరం పైన శ్రద్ధ తీసుకోలేకపోవటంతో అంటే మాయిశ్చరైజేషన్,.సన్ స్క్రీన్ వంటి విషయాలలో ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం డల్ గా అయిపోయి కాంతి రేఖలు కాంతి హీనమవుతాయి.