ఎదో ఒక యాడ్  చాలా ఫ్యాషన్ గా ఉన్న అమ్మాయి చెప్పుల షాపులో కాళ్ళు  చూపిస్తే ఆ పగుళ్లు చూసి షాపులో కుర్రాడు అబ్బా ఏమిటంత డర్టీగా అని మొహం పెడతాడు. నిజమే. సౌందర్య పోషణలో ముఖానికి ఇచ్చిన ప్రాముఖ్యం పాదాలకు ఇవ్వకపోతే అలాగే ఉంటుంది. మడమ దగ్గర మురికి పగుళ్లు లేకుండా ఉండాలంటే రాత్రివేళ పాఠాలు  శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఫ్రూట్ క్రీమ్ లో గ్లైకోలిక్  యాసిడ్ వున్నది ఎంచుకుంటే పాదాల పగుళ్లు రావు. చర్మం మృదువుగా అయిపోతుంది. క్రీమ్  రాసుకుని సాక్స్  వేసుకుంటే దుప్పట్లు పాడైపోకుండా ఉంటాయి. ఫ్యూమిక్ స్టోన్ తో రుద్ది కడిగి బాదం నూనె కానీ ఆయిల్ కొబ్బరి నూనె ఎదో ఒకటి రాసి మసాజ్ చేస్తే పాదాలకు మంచి విశ్రాంతి లభిస్తుంది. కాండిల్ వాక్స్ ,ఆవ నూనె కలిపి వేడి చేసి పాదాల పగుళ్ల దగ్గర రాసి సాక్స్ వేసుకున్న చక్కగా ఉంటాయి. గోరు వెచ్చని నీటిలో మంచి సుగంధ నూనె వేసి పాఠాలు  అందులో మునిగేలా వుంచితే  ఎంతో రిలాక్స్ అయిపోవచ్చు.

Leave a comment