‘యువర్ నేం ఈజ్ జస్టిన్’. జర్మన్ ఇంగ్లీష్ భాషల్లో నిర్మించిన ఈ సినిమా డైరెక్టర్ ఫ్రాంకోకి డాపెన్ .   లైంగిక బానిసత్వం ఇతివృత్తంగా ఇంత గొప్ప సినిమా తీసినందుకు యావత్తు స్త్రీ జాతి ఈ డైరెక్టర్ కు రుణపడి ఉండాలి.  “మారియోలా” పోలాండ్ లోని లక్సెంబర్గ్ అమ్మమ్మతో పాటు నివసించే యువతి. జీవితం పట్ల ఆమెకున్న ఆశలు అంతులేనివి.   ఆమె ప్రేమించిన “ఆర్ధర్” ఆమెను మోసగించి పాస్ పోర్ట్ తీసుకోని అమ్మెస్తాడు.  ఎంతో మంచి ఆమెను దారుణంగా లైంగిక హింసకు గురిచేస్తారు.  ఒక హోటల్ లో కాల్ గర్ల్ గా ఉంటుంది.  అక్కడ ఒక రోజు తారసపడ్డ “ఆర్ధర్”ని చంపేస్తుంది.  జైలు శిక్ష అనుభవిస్తుంది.   ఏమీ ఎరుగని ముగ్ధ బాలిక “మారియోలా” ఎల నష్టపోయి నిస్సహాయంగా హింసపడిందో . ఈ సినిమా ఆద్యంతం  ఒక కన్నీటి సముద్రం తప్పని సరిగా చూడవలసిన చిత్రం.

Leave a comment