Categories
ఇటు ఇంటి పనులు, అటు ఉద్యోగ బాధ్యతలతో క్షణం క్షణం తీరిక లేకుండా పని చేస్తుంటారు మహిళలు. ఈ యాంత్రికత పెరిగే కొద్దీ ఒత్తిడి తప్పదు. ఇందుకోసం పది నిముషాలు కేటాయించుకొండి, ఆ సమయంలో ఇలా చేయండి అంటున్నారు నిపుణులు. హాయిగా నవ్వుకోవడం, ఓ పాట పడుకోవడం లేదా ఒక్క పది నిమిషాలు విశ్రాంతిగా నిద్రపోవడం అయినా పర్లేదు. ఈ నిద్రని కూడా పవర్ న్యాప్ అంటారట. ఇలా చేస్తే కూడా ఒత్తిడి మాయమై జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు. జర్మనీ అధ్యయిన కారులు లేదా తోట పని మనస్సు ప్రశాంతత కోసం ధ్యానం అన్నింటికంటే బెస్ట్ పుస్తకం చదివే అలవాటు డెవలప్ చేసుకుంటే అన్ని రకాల వటత్తిడిలు మాయమైపోతాయంటున్నారు. తప్పని సరిగా సాహిత్యపు ఉద్యానవనం లోకి తలుపులు తెరవండి, సుఖంగా వుంటారు.