ఇంటర్నెట్ వాడకం గంటల కొద్దీ పెరిగిపోవటం మెదడు పనితీరు మార్చేస్తోంది అంటున్నారు పరిశోధికులు. అదే పనిగా ఆన్ లైన్ లో ఉంటే దాని ప్రభావం తో జ్ఞాపక శక్తి ఆలోచనలు సామజిక సంబంధాలు తీవ్ర స్థాయిలో క్షిణిస్తాయని అంటున్నారు . ఇంటర్నెట్ వాడేవాళ్ళ లో ఏకాగ్రత తగ్గుతోందని చెపుతున్నారు . గూగుల్ సెర్చ్ లేదా ఇంటర్నెట్ లో ప్రతి సమాచారం తేలిగ్గా దొరుకుతోంది దానితో మెదడు లో అంకెలన్నీ గుర్తించుకోవలసిన అవసరం తగ్గిపోయిదానికి సంబందించిన మెదడు భాగం పనితీరు తగ్గుతోంది. అంటే ఒక విషయం ఎంత వేగంగా తెలుసుకోవచ్చో,అంతే వేగంగా దాన్ని మరిచిపోతారన్నమాట దాన్ని గుర్తించుకొనే పని మెదడు చేయటం తగ్గిస్తోంది. ఈ విషయాన్ని పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడే విషయంలో కాస్త సంయమనం పాటించమంటున్నారు ఆటలకి వ్యాయామానికి సమయం కేటాయిస్తే మెదడు పనితీరు లక్షణంగా వుంటుందని చెపుతున్నారు.

Leave a comment