పండగ కోసం మిఠాయిలు ఇంటినిండా ఉంటాయి . తింటే అదనంగా కేలరీలు వంట్లో చేరతాయని భయపడకుండా హాయిగా పండగని ఎంజాయ్ చేసి ఆ పైన శరీరంలో అదనంగా చేరిన కొవ్వును కరిగించేయండి . యోగాతో అదేమంత కష్టం కాదు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఎలాగూ నడుస్తున్నారు కదా,కాస్త వేగంగా ఎక్కువసేపు నడిస్తే బ్రిస్క్ వాక్ తో కొవ్వు తగ్గటమేకాక శక్తిస్థాయిలు కూడా పెరుగుతాయి . అలాగే స్కిప్పింగ్ మరో విలువైన వ్యాయామం ఈ గెంతటం తో శరీరం అంత రక్తప్రసరణ సాఫీగా సాగి మేలుచేసే ఎండార్ఫిన్ లు విడుదల అవుతాయి . నిమ్మరసం ,దాల్చిన చెక్కతో చేసిన హెర్బల్ టి, అల్లం జీలకర్ర టీలు బరువును నియంత్రణలో ఉంచుతాయి శరీరంలో మలినాలు బయటకు పోతాయి .

Leave a comment