వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేద గృహావైద్యంలో వాడుకలో ఉన్న పసుపు ఇప్పుడు పాశ్చత్య నిపుణుల చేతిలో పడింది.అందులోని కూర్ క్యూమిన్ అనే రసాయనం వల్ల జరిగే ఉపయోగాల గురించి ఎన్నో అధ్యయనాలు వస్తున్నాయి. మతి మరుపుకి క పసుపును మించిన మందు లేదంటున్నారు.చిరాకు, ఆందోళన ,నిరాశలతో బాధపడేవాళ్లకు కూర్ క్యూమిన్ టాబ్లెట్లు ఇస్తే మెదడు చురుగ్గా మారిందని పరిశోధన చెపుతోంది.దీన్నీ బయోగా-3 ఫ్యాట్ ఆమ్లాలతో కలిపి వాడితే మోకాళ్ళు ,కాళ్ళ నొప్పులకు బ్రూఫిన్ లాగే పని చేస్తుంది. కాలేయం పని తీరు మెరుగు పరుస్తుందనీ వృద్దాప్యాన్ని అడ్డుకొంటున్నదని ఇలా ఒక టేమిటి సకల వ్యాధులకు కూర్ క్యూమిన్ మందులా పని చేస్తుందని అన్ని అధ్యయనాలు అంగీకరిస్తున్నాయి. ఇప్పుడు పసుపులో కలిసి గోల్డెన్ మిల్క్ ,కాఫీ ,టీ,ఐస్ క్రీమ్,బన్, బ్రెడ్ ,కూకీస్ ,తెనె ,నెయ్యి అన్ని తయారవుతున్నాయి.

Leave a comment