పాలక్ ముచ్చల్  మంచి సింగర్ సామాజిక సేవ లక్ష్యంగా పనిచేస్తుంది. ఇండోర్ కు చెందిన పాలక్ తొలి ఫండ్ రైజింగ్ ప్రాజెక్ట్ కార్గిల్ సైనికుల కోసం చేసింది. అలాగే పిల్లల గుండె ఆపరేషన్ల కోసం కూడా పాటలు పాడి ఫండ్స్ వసూలు చేస్తుంది.మూడు వేల మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించేందుకు తనలోని కళ మాధ్యమంగా ఉపయోగపడిందని చెబుతోంది. పేద పిల్లలకు అండగా నిలిచేందుకే భగవంతుడు నాకి గొంతు ఇచ్చాడనుకుంటాను. ఇంకా నా లిస్ట్ లో 413 మంది పిల్లల హార్ట్ సర్జరీల కోసం వేచి ఉన్నారు. వాళ్ళ కోసం ఎన్ని పాటలైనా పాడుతాను అంటుంది పాలక్.

Leave a comment